Delhi: వామ్మో.. ప్రియుడిని చంపి.. నెయ్యి, వైన్ పోసి తగులబెట్టిన ప్రియురాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking Murder Case: దేశ రాజధాని ఢిల్లీ తిమార్‌పూర్‌లో అక్టోబర్ 6న జరిగిన యూపీఎస్‌సీ అభ్యర్థి దారుణ హత్యకు సంబంధించిన సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఈ హత్య వెనుక ఉన్న కుట్రను ఢిల్లీ పోలీసులు తాజాగా బయటపెట్టారు. ఈ కేసులో ప్రియురాలితో సహా ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఆ ప్రియురాలు ప్రియుడి గొంతు కోసి చంపి, సాక్ష్యాలను నాశనం చేసినందుకు నిప్పంటించినట్లు పోలీసులు తెలిపారు.
READ MORE: Supreetha: మోకాళ్లపై శ్రీవారి మెట్లెక్కిన ప్రముఖ నటి కూతురు
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
అసలు ఏం జరిగింది..?
అక్టోబర్ 6న గాంధీ విహార్ లోని నాల్గవ అంతస్తు ఫ్లాట్ లో అగ్నిప్రమాదం జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకునేసరికి కాలిపోయిన మృతదేహం కనిపించింది. తరువాత మృతుడిని 32 ఏళ్ల రామ్ కేష్ మీనాగా గుర్తించారు. అయితే.. సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కుట్రను బయటపెట్టింది. సంఘటన జరిగిన రోజున ముసుగు ధరించిన ఇద్దరు వ్యక్తులు భవనంలోకి ప్రవేశించినట్లు ఫుటేజ్‌లో కనిపించింది. వారిలో ఒకరు దాదాపు 39 నిమిషాల తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత.. తెల్లవారుజామున 2:57 గంటలకు ఒక మహిళ, మరో వ్యక్తితో కలిసి ప్లాట్ నుంచి బయటకు వచ్చింది. వెంటనే అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన పోలీసుల అనుమానాన్ని రేకెత్తించింది.
READ MORE: Cyclone Montha: దూసుకొస్తున్న మొంథా తుఫాన్.. ఏపీ, యానాం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ
ఈ ఘటనపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. రామ్ కేష్ ప్రియురాలు అమృత చౌహాన్(21) ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. అమృత చౌహాన్, ఆమె మాజీ ప్రియుడు సుమిత్ కశ్యప్( 27), అతని స్నేహితుడు 29 ఏళ్ల సందీప్ కుమార్ కలిసి రామ్ కేష్ మీనాను హత్య చేశారు. అనంతరం మృతదేహంపై నూనె, నెయ్యి, మద్యం పోసి ఎల్పీజీ సిలిండర్ రెగ్యులేటర్ తెరిచి పేల్చేశారు. దీన్ని అగ్ని ప్రమాదంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఈ ముగ్గురూ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ నివాసితులుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అక్కడ పోలీసులు వారిని అరెస్టు చేశారు. రామ్ కేష్ మీనా వద్ద తనకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు ఉన్న హార్డ్ డిస్క్ ఉందని అమృత తెలిపింది. వాటిని డిలీట్ చేయడానికి తన ప్రియుడు అంగీకరించలేదని అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు వెల్లడించింది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..