ఢిల్లీ హైకోర్టు ఆక్తికరమైన పిటిషన్ దాఖలైంది. ఢిల్లీలో ఉన్న ఎర్రకోట తనదేనంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే.. సుల్తానా బేగం అనే మహిళ… ఢిల్లీ రాజు బహదూర్ షా జాఫర్-2కు తానే నిజమైన వారసురాలినని ఉద్ఘాటించింది. దీంతో ఎర్రకోటను తనకు అప్పగించాలని లేదా తగిన పరిహారం చెల్లించేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ తన పిటిషన్ ద్వారా కోర్టును కోరింది. 1857లో బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ వర్గాలు బహదూర్ షాను పదవీచ్యుతుడిని చేశాయని… బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ…