విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ ఎమ్మె్ల్యే అభ్యర్థి సుజనా చౌదరి సమక్షంలో వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ కనకదుర్గ టెంపుల్ చైర్మన్ పైలా సోమి నాయుడు ఈరోజు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ.. సొంత జిల్లా నుంచి పోటీ చేయడం అదృష్టంగా భావిస్తానని తెలిపారు. దేశ రాష్ట్ర రాజకీయాలను చూశా... ప్రపంచం మొత్తం తిరిగానన్నారు. కృష్ణా జిల్లా నా పుట్టినిల్లు.. విజయవాడ వెస్ట్ అభ్యర్థిగా బరిలో దిగడాన్ని భగవంతుడి వరంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.…