Pakistan: దాయాది దేశం పాకిస్థాన్ లో ఆత్మాహుతి దాడి జరిగింది. బన్నూలోని చెక్ పాయింట్ దగ్గర ఉన్న ఓ కారును ఆత్మాహుతి దళ సభ్యుడు పేల్చి వేశాడు. కారును పేల్చిన తర్వాత అతని సహచరులు కాల్పులకు దిగినట్లు అక్కడి మీడియా తెలిపింది.
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి బీభత్సం సృష్టించింది. చైనా డ్రైవర్ సహా ఐదుగురు ఇంజనీర్లు మృతి చెందారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు.