ఆ ఎమ్మెల్యే ఏదో…… గొప్పగా…… సెటైరికల్‌గా మాట్లాడదామనుకుంటే….. చివరికి సుర్రు సుమ్మైపోయిందా? మాటలు మిస్ ఫైర్ అయిపోయి అట్రాసిటీ కేసు పెట్టించుకునేదాకా వెళ్ళాయా? ఫైనల్‌గా జంక్షన్ జామైపోయే పరిస్థితులు వచ్చాయా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ మాటలు బూమరాంగ్ అయ్యాయి? ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నట్టు కనిపిస్తోంది. నియోజకవర్గంలోని వ్యవహారాలు ఆయన మీద అట్రాసిటీ కేసు బుక్ చేసేదాకా వెళ్లాయట. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్‌ని ఉద్దేశించి…
కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి ఆ తర్వాత పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై టి.పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి.. తర్వాత ఆ ఎమ్మెల్యేలు కౌంటర్ ఎటాక్ దిగినా.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ నుంచి అదే స్థాయిలో విమర్శలు వచ్చాయి.. ఇక, నిన్న గాంధీ భవన్ వేదికగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్.. ముఖ్యంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని టార్గెట్ చేశారు.. అయితే, మధు…
గాంధీ భవన్ వేదికగా పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం ఉత్సాహవంతంగా సాగుతోంది.. ఈ కార్యక్రమంలో మాట్లాడిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్… అనేక విషయాలను ప్రస్తావించారు.. కేసీఆర్ సర్కార్ అన్ని విధాలుగా విఫలం అయ్యిందని మండిపడ్డ ఆయన.. మరోవైపు బీజేపీపై కూడా విమర్శలు చేశారు.. ఇక, కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి.. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై తీవ్రంగా స్పందించారు..…