టాలీవుడ్ హీరో సుధీర్ బాబు ఎప్పుడూ ట్రెండ్‌కు తగ్గట్టు కాకుండా, తనకిష్టమైన విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు ఆయన నటించిన కొత్త సినిమా “జటాధర” ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్, దైవిక అంశాల ట్రెండ్ నడుస్తున్న సమయంలో కూడా, సుధీర్ మాత్రం ఈ కథను ట్రెండ్ కోసం కాకుండా, కంటెంట్ బలం కోసం ఎంచుకున్నానంటున్నారు. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సుధీర్ మాట్లాడుతూ.. “ఇప్పుడున్న ట్రెండ్ రెండేళ్ల తర్వాత…