దేశవ్యాప్తంగా ‘కేజీఎఫ్-2’ సందడి, రాఖీ భాయ్ వయోలెన్స్ నడుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరంగందూర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టడంతో నిర్మాతలు మంచి ప్రాఫిట్స్ ను జేబులో వేసుకున్నారు. అంతేకాదు ‘కేజీఎఫ్’ మూవీ కారణంగా హోంబలే ఫిలిమ్స్ పేరు మారుమ్రోగిపోయింది. ఇక ఇప్పుడు హోంబలే ఫిలిమ్స్ నెక్స్ట్ మూవీకి…
ప్రస్తుతం తన ఆస్కార్ ఫీచర్ చిత్రం ‘జై భీమ్’ భారీ విజయంతో సంచలనం సృష్టించిన కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు 2022లో అద్భుతమైన లైనప్ ఉంది. సూర్య తాజాగా మాట్లాడుతూ తన ప్రాజెక్ట్ ల గురించి వెల్లడించారు. త్వరలో రజనీకాంత్ ‘అన్నాత్తే’ ఫేమ్ దర్శకుడు శివ, ‘సూరారై పొట్రు’ దర్శకురాలు సుధా కొంగరతో కలిసి నెక్స్ట్ సినిమాలు చేస్తానని ఆయన చెప్పారు. ఈ రెండు ప్రాజెక్ట్‌లకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, సూర్య స్వయంగా ఈ…
లేడీ డైరెక్టర్ సుధ కొంగర, సౌత్‌లో డిఫరెంట్ కథలతో సినిమాలను ఎంచుకునే సూర్య కాంబినేషన్ మరోసారి రీపీట్ అవ్వబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరూ ” ఆకాశం నీ హద్దురా ” సినిమాతో సూపర్ హిట్‌తో పాటు ఎన్నో అవార్డులు సాధించారు. సుధ కొంగర మరోసారి సూర్యను డైరెక్ట్ చేయబోతుంది. దీనికి సంబంధించిన కథ చర్చలు ఈ మధ్యనే ముగిసినట్టు సమాచారం. ఇదే జరిగితే వారి ఖాతాలో మరో భారీ హిట్టు పడటం ఖాయమంటున్నాయి…
సూర్య హీరోగా నటించిన ‘సూరారై పోట్రు’ చిత్రం తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’గా విడుదలై చక్కని ఆదరణ పొందింది. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సూర్య ఓటీటీ స్ట్రీమింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అందులోనే జనం ముందుకు వచ్చింది. దాంతో ఇంటి డ్రాయింగ్ రూమ్ లోనే వాళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆనందించారు. ఈ సినిమాను హిందీలోనూ రీమేక్ చేయబోతున్నట్టు ఆ మధ్య సూర్య ప్రకటించాడు. తమిళ వర్షన్ ను డైరెక్ట్ చేసి సుధా…
సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాకు అటు విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటు ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది. ఎయిర్ డక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ బయోపిక్ గా సుధకొంగర తెరకెక్కించిన ఈ సినిమాకు సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్ లోనూ రీమేక్ అవుతోంది. తాజాగా ఈ సినిమా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చూశారు. అమితాబ్ బచ్చన్ తన పర్సనల్ బ్లాగ్ లో ఇదే…
అమెజాన్ ప్రైమ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న మూవీ “సూరారై పొట్రు”. సూర్య హీరోగా, సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ హిట్ రీమేక్ లో అక్కడ హీరోగా ఎవరు నటిస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆ జాబితాలో పలువురు స్టార్ హీరోల పేర్లు విన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్నటి వరకూ హిందీ రీమేక్ లో హృతిక్ రోషన్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ స్థానంలో…
తమిళంలో రూపొంది తెలుగులోనూ మంచి మార్కులు సంపాదించిన ‘సూరరై పోట్రు’ సినిమా హిందీ తెర మీదకి వెళుతోంది. ఈ విషయాన్ని స్వయంగా హీరో సూర్య ప్రకటించాడు. అయితే, బాలీవుడ్ వర్షన్ కి కూడా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నప్పటికీ హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ లేదు. సూర్య హిందీ వర్షన్ ‘సూరరై పోట్రు’లో నటించే అవకాశాలు దాదాపుగా లేనట్లే! మరి బీ-టౌన్ లో ‘సూరరై పోట్రు’ కథకి తగిన ఇంటెన్స్ యాక్టర్ ఎవరు? Read Also :…
సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘సూరారై పోట్రు’ తమిళంలోనే కాదు ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు సూర్య అభిమానులనూ అలరించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను నిర్మించిన సూర్య ఇప్పుడు హిందీలోనూ దీన్ని రీమేక్ చేస్తున్నట్టు తెలిపారు. సూర్యకు చెందిన 2డీ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు అబుందాంతియా ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను…
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం “ఆకాశం నీ హద్దురా”. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకులు జి ఆర్ గోపీనాథ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని ప్రముఖుల డైరెక్టర్ సుధా కొంగర తెరకెక్కించారు. అపర్ణా బాలమురళి ఇందులో హీరోయిన్ గా నటించగా… ఊర్వశి, పరేష్ రావల్, మోహన్ బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. తమిళంలో “శురారై పొట్రు”, తెలుగులో “ఆకాశం నీ హద్దురా” అనే టైటిల్ తో ఈ చిత్రం విడుదలైంది. నవంబర్…
‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రముఖ లేడీ డైరెక్టర్ సుధా కొంగర. ఈ మహిళా దర్శకురాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా చేయనుందని గతకొద్ది రోజులుగా వార్తలు విన్పిస్తున్నాయి. తాజాగా విన్పిస్తున్న బజ్ ప్రకారం సుధా కొంగర ప్రభాస్‌కు ఒక కథను వివరించారట. ఇటీవలే ప్రభాస్ తో సుధా సమావేశమయ్యారట. ఓ సోషల్ డ్రామాను ఆమె ప్రభాస్ కు చెప్పారట. స్టోరీ లైన్ కు ప్రభాస్ కు ఇంప్రెస్…