Suriya 43 : సూర్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన ఐశ్వర్య లక్ష్మి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమా తో ఎంతో బిజీ గా ఉన్నాడు. సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధా కొంగర డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం సూర్య నటిస్తున్న కంగువ ఆయన కెరీర్ లో42 వ సినిమా గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.. ఇదిలా ఉంటే సూర్య మరోవైపు ఆకాశం నీ హద్దురా (సూరారై పోట్రు) ఫేం సుధా కొంగర డైరెక్షన్ లో తన 43 వ సినిమా కూడా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరో సూర్య సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటించబోతున్నట్టు ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది..
ఐశ్వర్య లక్ష్మి ఓ చిట్‌చాట్ లో మాట్లాడుతూ సూర్య గారు నటించిన సూరారై పోట్రులో నేను బొమ్మి పాత్ర లో నటించాల్సింది. కానీ మధురై తమిళ యాస విషయంలో ఆ సినిమా చేయలేకపోయానని ఆమె తెలిపింది.. దీంతో ఈ సారి సుధా కొంగర, సూర్య కాంబినేషన్ లో వస్తున్న సూర్య 43 లో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా దాదాపు ఫైనల్ అయిపోయిందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.దీనిపై మేకర్స్ మరి కొద్దీ రోజుల్లో అధికారిక ప్రకటన చేస్తారేమో చూడాలి.ఇప్పటివరకు వస్తున్న అప్‌డేట్స్ ప్రకారం సూర్య 43 సినిమా షూటింగ్ అక్టోబర్ లో మొదలు కానున్నట్లు సమాచారం..ఈ సినిమా గ్యాంగ్ స్టర్ డ్రామా నేపథ్యంలో ఉండనుందని తెలుస్తుంది..అలాగే సూర్య స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం వెట్రిమారన్ విడుతలై పార్ట్ 2 షూటింగ్ లో బిజీ గా వున్నారు. ఈ సినిమా పూర్తి చేసిన తర్వాత సూర్య తో వాడివాసల్ సినిమా ను చేయనున్నట్లు సమాచారం
Also Read
- PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
- Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
- Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..