ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆ జట్టు 9 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఆడుతున్న తొలి ఐపీఎల్ సీజన్‌లోనే అద్భుత ఆటతీరుతో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా జట్టు విజయాల గురించి కెప్టెన్ హార్డిక్ పాండ్యా స్పందించాడు. జట్టులో ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనే హెచ్చుతగ్గులు లేకపోవడమే తమ విజయాలకు కారణమన్నాడు. తాను కెప్టెన్ అయినా జట్టులోని మిగతా ఆటగాళ్లు తక్కువ అన్న…