రేషన్ మాఫియా రూట్ మార్చిందా..? చిన్నచిన్న వాహనాల్లో అయితే ఈజీగా దొరికేస్తామని ఏకంగా రైళ్లలోనే అక్రమ రవాణాకు తెగిస్తున్నారా..? రాష్ట్ర సరిహద్దులు లేదా జిల్లా సరిహద్దుల్లో గోదాముల్లో నిల్వ చేసి రాత్రికి రాత్రే రాష్ట్రాలు దాటిస్తున్నారా..? అంటే అవుననే స్పష్టం అవుతోంది.. కొమురం భీం జిల్లా సిర్పూర్ టి రోడ్డు రైల్వే స్టేషన్ మీదుగా పీబీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. పేద ప్రజలకు ఆకలి తీర్చేందుకు అందించే పీడీఎస్ బియ్యాన్ని కొందరు దళారులు అక్రమమార్గం…