ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా.. తన ఎంపీ పదవికి రాజీనామా సమర్పించేందుకు పార్లమెంట్ కు వెళ్లారు. అక్కడ స్పీకర్ ఓం బిర్లాను కలిసి రాజీనామాను సమర్పించారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ స్పీకర్ దగ్గరకు తీసుకుని వెళ్లారు.
రాజకీయ పార్టీలు ఇకపై తమ ఆడిట్‌రిపోర్ట్ లను భారత ఎన్నికల కమిషన్‌కు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. నేరుగా ఈసీఐ వెళ్లి సమర్పించాల్సిన అవసరం లేకుండా తమ ఆడిట్ రిపోర్టులను ఆన్‌లైన్‌లో సమర్పించడానికి అవకాశం కల్పించింది.