రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా విజయనరంలో విస్తృత పర్యటన అనంతరం చర్యలు మొదలయ్యాయి. శృంగవరపుకోట సబ్ రిజిస్ట్రార్ ని సస్పెండ్ చేశారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట.. ఎస్.కోట సబ్ రిజిస్ట్రార్ శ్యామలను సస్పెండ్ చేస్తూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ విజయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.