India Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్‌కి రష్యా అందించాల్సిన రెండు స్క్వాడ్రన్‌ల S-400 క్షిపణి వ్యవస్థల డెలివరీ ఆలస్యమైంది. అయితే, వీటిని 2026-27 నాటికి పంపిణీ చేస్తామని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోవ్, భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కి హామీ ఇచ్చారు. చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశం సందర్భంగా ఇద్దరూ ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఇరు దేశాలు దీర్ఘకాలిక రక్షణ భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటించాయి.
భారత రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అయ్యేందుకు ఇటీవల డీఆర్డీఓ, సైన్యం వరసగా క్షిపణి ప్రయోగాలు చేస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్రహ్మోస్, పినాక వంటి క్షిపణులు అనుకున్నట్లుగానే లక్ష్యాలను ఛేదించాయి. తాజాగా మరోసారి భారత రక్షణ వ్యవస్థకు కీలక విజయం లభించింది. ‘బ్రహ్మోస్’ ఎయిర్ లాంచ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్ ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్ ఎస్యూ -30 ఎంకేఐ యుద్ధ విమానం నుంచి బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేయగా… బంగాళాఖాతంలోని లక్ష్యాన్ని…