ఈ నెల ప్రారంభంలో విడుదలైన ‘వీరమే వాగై సూదుం’లో చివరిగా కనిపించిన కోలీవుడ్ స్టార్ విశాల్ తన నెక్స్ట్ మూవీ ‘లత్తి’ షూటింగ్‌లో ఉన్నారు. వినోద్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సునైనా కథానాయికగా నటిస్తోంది. రమణ అండ్ నందా ప్రొడక్షన్ హౌస్ నిర్మించిన ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందించగా, ఎం బాలసుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. విశాల్ హైదరాబాద్‌లో ఈ చిత్రం మూడవ షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్ లో…