మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర బోడ్ ప్రైమరీ పాఠశాలకు తాళం వేశారు. దీంతో పాఠశాల ముందే విద్యార్థులు పడిగాపులు పడుతున్నారు. ప్రధానోపాధ్యాయురాలి నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు ఇక్కట్లు పడుతున్నారు. ఎన్ని సార్లు చెప్పినా తీరు మారడం లేదని విమర్శలు వస్తున్నాయి. మహబూబాబాద్ పట్టణంలోని వెంకటేశ్వర బోడ్ లోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న పొన్నమ్మ సమయపాలన పాటించడం లేదు. పిల్లలను సరిగా పట్టించుకోకపోవడం, చదువులు సరిగా బోధించకపోవడం, విద్యార్ధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వీటికి తోడు…