మరికాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానున్నారు. హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. హెచ్‌సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేదావులు, పర్యావరణ వేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అపోహాలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్…
CMR College: హైదరాబాద్‌లోని CMR కాలేజ్ హాస్టల్ వద్ద విద్యార్థి సంఘాల వల్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల సమస్యలను తెలుసుకోవాలని వచ్చిన NSUI (నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా) విద్యార్థి సంఘ నాయకులు, కాలేజ్ యాజమాన్యంతో గొడవకు దిగారు. గర్ల్స్ హాస్టల్ లోపలికి అనుమతి లేకుండా ఎలా వెళ్ళారని సిబ్బంది ప్రశ్నించడంతో విద్యార్థి సంఘాల నాయకులు సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. నిన్నటి సంఘటనతో గర్ల్స్ హాస్టల్ లో భయాందోళనకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులకు సమాచారం…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది.