Students Protest: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని ఐనవోలు విట్ యూనివర్సిటీలో విద్యార్థినులు హాస్టల్ భోజనం బాగాలేదని రోడ్డెక్కారు. హాస్టల్‌లో అందిస్తున్న టిఫిన్, భోజనం నాణ్యత లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
Shocking : ఒకవేళ మీరు బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే మీవద్ద డాక్యుమెంట్లు అడగడం సర్వసాధారణం. కానీ ఒక విద్యార్థి తన టీసీ (Transfer Certificate) తీసుకోవడానికి బ్యాంక్ ప్రమాణాలు పాటించాల్సిన రోజులు వచ్చినట్టున్నాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో ఉన్న ఓ ‘విద్యా మండలి’ డిగ్రీ కాలేజీ తాజాగా ఓ విద్యార్థితో చేసిన “ప్రామిసరీ నోట్ ఎపిసోడ్” ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కథ ఇలా ఉంది… శివ్వంపేట మండలానికి చెందిన శ్రీరామ్ నాయిక్ అనే…
రాజస్థాన్‌లో షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఉదయం ప్రార్థన సమయంలో ఇస్లామిక్ శ్లోకాలు (కల్మా) పఠించమని హిందూ విద్యార్థులను ఉపాధ్యాయులు బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోటలోని బక్షి స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో జరిగిన ఈ సంఘటన హిందూ సంస్థలలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే భారీ నిరసనలు చేపడతామని సంఘాల సభ్యులు హెచ్చరించారు. అయితే, ఆ ఫుటేజ్ చాలా సంవత్సరాల పాతదని పాఠశాల సిబ్బంది తెలిపారు.
రోహిత్ వేముల పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. గతంలో పలు కారణాలతో హెచ్‌సీయూలో ఆత్మహత్యకు పాల్పడ్డ దళిత విద్యార్థి రోహిత్ వేముల. చాలా కాలం తర్వాత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ పేరును ప్రస్తావించారు. విద్యావ్యవస్థలో నేటికి బలహీన వర్గాలు కుల వివక్షను ఎదుర్కొంటున్నాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దళిత విద్యార్థులెవరూ అటువంటి వివక్షను ఎదుర్కోకుండా ఉండాలంటే ‘రోహిత్ వేముల’ చట్టాన్ని రూపొందించాలని.. రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేయాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు సూచించారు.…