పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. థర్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి షాన్ మాలిక్ హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి హాస్టల్‌కు వచ్చిన తల్లిదండ్రులకు.. కుమారుడు శవమై కనిపించాడు.
బీహార్‌లో దారుణం జరిగింది. ముజఫర్‌పూర్ జిల్లాలో విద్యార్థుల గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. రెండు గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక విద్యార్థి హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
జేఈఈ (JEE) కారణంగా మరో విద్యాకుసుమం నేలరాలిపోయింది. సారీ నాన్నా... నేను జేఈఈ చేయలేను అంటూ తనువు చాలించాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) కోటాలో చోటుచేసుకుంది.