ఏ మనిషినైనా మంచివాడుగా, చెడ్డవాడుగా చిత్రీకరించేవి – అతని చుట్టూ ఉన్న పరిస్థితులే అని చెప్పవచ్చు. ఓ మనిషి దొంగకావడానికి అతనికి ఎదురైన పరిస్థితులు ఏంటి అని చర్చించవలసి ఉంటుంది. ఈ కోణంలో ఆలోచించే కరడు కట్టిన నేరస్థులలో సైతం పరివర్తన కలిగించాలని సామాజిక ఉద్యమకారులు గోరా, ఆయన కోడలు హేమలతా లవణం నడుం బిగించారు. ఎందరో దొంగలలో సత్ర్పవర్తన కలిగేలా చేశారు. అలా ప్రకాశం జిల్లాలో స్టూవర్ట్ పురం అనే ఊరిలో దొంగలలో మార్పు తీసుకు…