బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు.