భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పేరుందో మరోసారి రుజువైంది. అమెరికాలోని మన భారతీయ రెస్టారెంట్ ‘ఉత్తమ రెస్టారెంట్’గా ఎంపికైంది. నార్త్ కరోలినాలోని డౌన్ టౌన్ యాష్ విల్లేలో ఈ రెస్టారెంట్ ఉంది. దీన్ని 2009లో ప్రారంభించారు. భారతీయ స్నాక్స్‌ను ఈ రెస్టారెంట్ అందుబాటు ధరల్లోనే అందించడం ప్రత్యేకత. చికాగోలో సోమవారం జరిగిన జేమ్స్ బియర్డ్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో.. అమెరికాలోనే అత్యుత్తమ రెస్టారెంట్‌గా చాయ్ పానీని ఎంపిక చేశారు. న్యూ ఓర్లాన్స్‌కు చెందిన బ్రెన్నాన్‌ను వెనక్కి…