Dog Bite : ఎండ వేడిమి కారణంగా ప్రయాగ్‌రాజ్ 138 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. నగరంలో ఉష్ణోగ్రత 48.8 డిగ్రీలకు పెరిగింది. ఈ ఎండ వేడికి మనుషులే కాదు మూగ జంతువులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.
వీధికుక్కలు సైరవిహారం చేస్తున్నాయి. మనుషులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రజలపై కుక్కుల దాడి మరీ ఎక్కువైంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ సంఘటన శామీర్ పేట అద్రాస్ పల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
Manakondur: కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మానకొండూరు మండల కేంద్రంలోని చెరువు కట్టపై సంచరించిన భల్లూకం హనుమాన్ దేవాలయం సమీపంలోని..
5 Months Old Boy Dies in Street Dogs Attack in Shaikpet: వీధి కుక్కలు మరో చిన్నారి ప్రాణాలను బలి తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు, ఖమ్మంలోని రఘునాథపాలెం మండలంలో 5 ఏళ్ల చిన్నారి కుక్కల దాడిలో మృతి చెందిన ఘటనలు ఇంకా మన కళ్ల ముందు మెదలాడుతుండగానే.. తెలంగాణ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని షేక్‌పేటలో వీధి కుక్కల దాడిలో 5 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడిలో…
వర్షాకాలంలో బయట తిరిగే జంతువులకు తాత్కాలిక షెల్టర్లు సిద్ధం చేయాలని రతన్ టాటా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. అంతేకాకుండా, వర్షాకాలంలో వాహనాన్ని స్టార్ట్ చేయడానికి లేదా డ్రైవింగ్ చేయడానికి ముందు మీ వెహికిల్ కింద ఒక సారి చెక్ చేయాలని రతన్ టాటా వాహనదారులను కోరారు. ఇలా చెక్ చేయకుండా నడిపితే మీ వెహికిల్స్ కింద నిద్రిస్తున్న కుక్కలు, జంతువులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు.
హైదరాబాద్ పరిధిలో కుక్కల దాడులు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. ఇటీవల అంబర్ పేటలో బాలుడి మృతి ఘటన మరువక ముందే మరో ఘటన జరిగింది. కంటికి కనిపించిన వారిని కరుస్తూ ఆస్పత్రి పాలు చేస్తున్నాయి వీధి కుక్కలు.
హైదరాబాద్ నగరంలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.