గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ కుక్కల దాడికి బలైపోయిన ఘటన సంచలన రేపిన విషయం తెలిసిందే. అయితే.. ప్రదీప్ మరణంతో అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా కొన్ని రోజులు హడావిడిచేసి మళ్లీ ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. దీంతో వీధికుక్కల దాడులు నగరంలో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నేడు రాజేంద్రనగర్ అత్తాపూర్ లో మరోసారి వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల బాలుడి పై వీధి కుక్కలు దాడి. రెండేళ్ల బాలుడిని విచక్షణారహితంగా కుక్కలు కరవడంతో కేకలు పెట్టాడు బాలుడు. దీంతో..గమనించిన స్థానికులు కుక్కలను తరిమి కొట్టి బాలుడిని కాపాడారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Also Read : H3N2 influenza: ఏపీలో హెచ్3ఎన్2 వైరస్..! మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా.. ఎన్టీవీతో బాబును కాపాడిన సెక్యూరిటీ సిబ్బంది, స్థానికులు మాట్లాడుతూ.. అత్తాపూర్ తేజశ్వి కాలనీ లో ఇంటి ముందు ఆడుకుంటున్న 2 సంవత్సరాల బాలుడి పై 9 కుక్కల దాడి చేశాయి. ఆ సమయంలో బాబు తల్లి కులి పని చేస్తోంది. అంతలోనే రెండు వైపులా నుండి 9కుక్కలు బాబు పై విచక్షణారహితంగా కరిచాయి. బాబు అరుపులు వినబడ్డాయి మాకు వెంటనే కట్టెలు రాళ్లతో కుక్కలను తరిమి కొట్టాము. అప్పటికే బాబు కుడి చేయి కడుపు కళ్ళు ను కరిచి గాయపరచాయి.
Also Read : IND VS AUS: తొలి రోజు ఆసీస్ దూకుడు.. సెంచరీతో చెలరేగిన ఖవాజా
హుటాహుటిన స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాము. అనంతరం నీలోఫర్ ఆసుపత్రికి తరలించారు. బాబు ఫ్యామిలీ అరాంఘర్ చెందిన వారు ఇక్కడ కూలీ పనుల కోసం వచ్చారు. ఈ ఏరియాలో 20కు పైగా వీధికుక్కలు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ వారికి ఎన్ని సార్లు కాల్ చేసిన రెస్పాండ్ అవ్వడం లేదు. చిన్నారులు, వృద్దులు బయటికి రావాలంటేనే భయపడుతున్నారు.’ అని వాపోతున్నారు.