Dog Bite: చాలా మందికి కుక్కలంటే భయం. కుక్కలుంటాయని రాత్రిపూట వీధిలో నడవడానికి భయపడతారు. చాలా ఇళ్లలో కుక్కలున్నాయి జాగ్రత్త అనే బోర్డు ఉంటుంది. పెంపుడు కుక్కకు ఇప్పటికే యాంటీ రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చినప్పటికీ, పొరుగు కుక్కలకు దూరంగా ఉండాలి. కాటు రాబిస్‌కు కారణం కావచ్చు. అయితే కుక్క మిమ్మల్ని కరిచినట్లయితే ఏమి చేయాలో తెలుసుకుందాం.
Read Also: Sexual Ability : పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని ‘కోకా-కోలా, పెప్సీ’ మెరుగుపరుస్తాయట..
సాధారణంగా కుక్కలు ఒక్క సారి దాడి చేసి వెళ్లిపోవు. కుక్క దాడి చేసినప్పుడు, రక్షించుకోవడానికి మీ దగ్గర ఉండే బ్యాగ్, వాటర్ బాటిల్, హ్యాండ్‌బ్యాగ్ లేదా మందపు జాకెట్ ఉంటే వాటితో కుక్కలను నెట్టేసే ప్రయత్నం చేయండి. అప్పుడు కుక్క పళ్లు శరీరంలోకి దిగకుండా జాగ్రత్త పడవచ్చు. అయినా కుక్క మీపై దాడి కరిస్తే క్రింద పేర్కొన్న నివారణలను ప్రయత్నించండి.
Read Also: Dairy Milk :’ఇదిగో వంద సంవత్సరాల క్రితం నాటి డైరీ మిల్క్ కవర్’
కుక్క కరిచినప్పుడు, కుక్క రక్తం, లాలాజలం శుభ్రం చేయడానికి సబ్బు, శుభ్రమైన నీటితో ఆ ప్రాంతాన్ని కడగాలి. గాయంపై ఎలాంటి కట్టు కట్టవద్దు. బ్యాక్టీరియా సంక్రమణను తగ్గించడానికి గాయంపై క్రిమినాశక లేదా యాంటీ బాక్టీరియల్ క్రీమ్‌ను వర్తించండి. తెరిచి ఉంచితే గాయం త్వరగా ఆరిపోతుంది. రక్తస్రావం అయితే ఆపేందుకు నివారణ చర్యలను పాటించాలి. కుక్క కాటుకు గురైన తర్వాత మీరు ఇంట్లో ప్రథమ చికిత్స చేసి వెంటనే సమీపంలోని డాక్టరును సంప్రదించాలి. 24 గంటలలోపు యాంటీ-రాబిస్ ఇంజెక్షన్‌ను తీసుకోవాలి. కుక్క కాటు చాలా సార్లు అపస్మారక స్థితి లేదా మైకంలోకి తీసుకెళ్తుంది. అటువంటి పరిస్థితిలో అత్యవసర నంబర్‌కు కాల్ చేసి వైద్య సహాయం తీసుకోండి.