Stray Dog Kills Baby: రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకుంది. సిరోహి జిల్లాలో ప్రభుత్వాసుపత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల వయసున్న చిన్నారిని వీధికుక్క తీసుకెళ్లి చంపినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
కేరళలోని తిరువనంతపురంలో 50 అడుగుల లోతున్న పోటా బావిలో ఓ వీధికుక్క వారం రోజుల పాటు ఇరుక్కుపోయింది. భద్రతా కారణాలను చూపుతూ, వీధి కుక్కను రక్షించలేమని అగ్నిమాపక దళం నిర్ణయించింది.
బీహార్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. ఒక్కరోజే 80 మందిని కరిచి స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. బీహార్‌లోని అర్రాలో ఒక వీధికుక్క బుధవారం 80 మందిపై దాడి చేసిందని అధికారులు ఈరోజు తెలిపారు.