Strange Weather Condition: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. పగలేమో ఎండ దంచేస్తోంది.. రాత్రైతే చలి వణికిస్తోంది. ఫిబ్రవరిలోనే.. సమ్మర్ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. పగటిపూట 38 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు.. రాత్రికి సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల్లో అత్యధిక హెచ్చుతగ్గులతో.. జనం ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత నాలుగు రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. చలి వణికిస్తోంది. దీంతో రాష్ట్రంలోనే అత్యల్పంగా అల్లూరి జిల్లా కుంతలంలో 7.5, జీకే…