ఉత్తర జపాన్‌పై ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. శనివారం జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతమైన నోటోలో భారీ వర్షం కురిసింది.