Smuggling : నాంపల్లి ప్రాంతంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో అధికారులు 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. STF ఏ-టీమ్ లీడర్ అంజిరెడ్డి అందించిన సమాచారం మేరకు సిబ్బంది సమన్వయంతో ఈ దాడులు జరిగాయి. తనిఖీల్లో గంజాయితో పాటు ఒక టు-వీలర్, సెల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో హట్ గోడకు…