ఎండాకాలం వచ్చేసింది. భానుడు ప్రచండంగా మారిపోతున్నాడు. సూరీడు దెబ్బకు జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగవద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. కోవిడ్ టైంలో ఎలాగైతే జాగ్రత్తలు పాటించామో ఇప్పుడు కూడా అదేవిధంగా జాగ్రత్తగా వుండాలి. ఒకవేళ ఎవరికైనా వడదెబ్బ తగిలితే వెంటనే త్వరగా…