Statue Of Liberty: బ్రెజిల్ దక్షిణ భాగంలో సోమవారం (డిసెంబర్ 15) తీవ్ర తుఫాన్ గువైబా నగరాన్ని అతలాకుతలం చేసింది. రియో గ్రాండే డో సుల్ రాష్ట్రంలోని గువైబాలో, హావన్ మెగాస్టోర్ బయట ఏర్పాటు చేసిన 24 మీటర్ల ఎత్తైన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం బలమైన గాలుల ధాటికి కూలిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. భారీ విగ్రహం నెమ్మదిగా ముందుకు ఒరిగి ఖాళీ పార్కింగ్ స్థలంపై పడిపోతున్న…