Startups Fundraising: సొంతగా వ్యాపారం చేయాలనే ఆలోచనలైతే దండిగా ఉన్నాయి కానీ.. అవి ఆచరణలోకి రావటానికి ఆర్థికంగా అండగా నిలిచేవారు కనిపించట్లేదు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు మరియు వెంచర్ క్యాపిటలిస్టులు పెట్టుబడులు పెట్టేందుకు ధైర్యంగా ముందుక రాలేకపోతున్నారు. దీంతో.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆదిలోనే హంసపాదు ఎదురవుతోంది. గత నెల ఫిబ్రవరిలో స్టార్టప్‌ల ఫండ్‌రైజింగ్ 8 నెలల కనిష్టానికి పడిపోయింది. ఏడాది కిందటితో పోల్చితే ఏకంగా 83 శాతం తగ్గిపోయింది.