ప్రపంచ వ్యాప్తంగా 45 రోజులపాటు వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగింది. స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో భారత్ ఫైనల్ వరకు వచ్చి ఆసీస్ చేతిలో ఓడిపోయింది. ఈసారి టైటిల్ గెలుస్తారన్న నమ్మకంతో ఉన్న టీమిండియా అభిమానులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ఎట్టకేలకు వరల్డ్ కప్ మహా సంగ్రామం ముగిసిపోయింది. దీంతో తర్వాత వరల్డ్ కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. వచ్చే వరల్డ్ కప్ లో కొందరు స్టార్ ఆటగాళ్లు దూరంకానున్నారు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్‌ఎల్‌సీ) రెండవ ఎడిషన్‌కు రంగం సిద్ధమైంది. ఈ నెల 18 నుంచి డిసెంబర్ 9 వరకు ఎల్‌ఎల్‌సీ టోర్నీ జరుగనుంది. డెహ్రాడూన్, రాంచీ, జమ్ము, విశాఖపట్నం, సూరత్ నగరాల్లో లెజెండ్స్ లీగ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ టోర్నీలో అర్బన్ రైజర్స్ హైదరాబాద్, ఇండియా క్యాపిటల్స్, మణిపాల్ టైగర్స్, గుజరాత్ జెయిం ట్స్, సదరన్ సూపర్ స్టార్స్, బిల్వారా కింగ్స్ పోటీపడుతున్నాయి.