గర్భం దాల్చిన ఓ మహిళను గురువారం ఉదయం లాడ్‌లో కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ ఘటనలో ఆమె కడుపులో పెరుగుతున్న శిశువు కూడా మరణించింది. తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ఆమె పుట్టబోయే బిడ్డను రక్షించే ప్రయత్నంలో అత్యవసర సిజేరియన్ ఆపరేషన్ చేశారు. అప్పటికే వారిద్దరూ చనిపోయారని వైద్యులు తెలిపారు.