విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలనే పట్టుదలతో అడుగులు ముందుకు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరకు ఆ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.. కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడియన మంత్రి ఆదిమూలపు సురేష్.. సుప్రీంకోర్టులో పరీక్షలపై విచారణ జరిగిన విషయాన్ని వెల్లడించారు.. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాల ప్రకటనకు 45 రోజుల సమయం పడుతుందన్న ఆయన.. కానీ, సుప్రీకోర్టు చెప్పిన విధంగా వచ్చే నెల 31 నాటికి పరీక్షల ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం…