తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బోర్డు మెంబర్ పోకల అశోక్ కుమార్ శుభవార్త అందించారు. మే 1 నుంచి శ్రీవారి మెట్టు మార్గాన్ని నడక భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గత ఏడాది నవంబర్ నెలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీవారి మెట్టు మార్గం ధ్వంసమైంది. దీంతో మెట్లు మరమ్మతులకు గురికావడంతో ఐదు నెలలుగా నడక మార్గం మూతపడింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా మరమ్మతుల పనులు పూర్తి చేసినట్లు టీటీడీ మెంబర్ పోకల అశోక్ కుమార్…