Telangana Reservoirs Overflow: తెలంగాణలోని ప్రధాన నది ప్రాజెక్టులైన శ్రీరాంసాగర్, నిజాంసాగర్, నాగార్జునసాగర్, సింగూరులకు భారీగా వరద వస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తింది. దీంతో అధికారులు 40 వరద గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి లక్షా 46 వేల క్యూసెక్కుల నీరు వస్తుండగా, రెండు లక్షల 55 వేల క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది.…