హైదరాబాద్ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ బిజీబిజీగా గడిపారు. ముచ్చింతల్ లోని శ్రీరామానుజ సమతా మూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని సందడి చేశారు. అంతకముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ భుజం తట్టి పలకరించారు. ‘క్యా బండీ.. కైసే హై’ అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆ తర్వాత జితేందర్‌రెడ్డి, కిషన్ రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డిలను కూడా పలకరించారు. మోడీని ఆహ్వానించేందుకు వచ్చారు కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ జి.కిషన్ రెడ్డి. పర్యటన ముగించుకుని తిరిగి…
ఇవాళ రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణకు రానున్నారు. ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామానుజ స్వామి సహస్రాబ్ది సమారోహంతో పాల్గొనడంతో పాటు పటాన్ చెరులోని ఇక్రిశాట్ లో జరిగే కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. తెలంగాణకు వస్తున్న ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్, ముచ్చింతల్‌ల్లో జరిగే కార్యక్రమాల్లో ఇద్దరూ కలిసే పాల్గొంటారని వివరించాయి.…
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామిని దర్శించుకున్నారు ఏపీ దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు. వచ్చే నెల రెండు నుంచి జరిగే శ్రీ రామానుజ సహస్ర శతాబ్ది ఉత్సవ విశేషాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి వెలంపల్లి. వచ్చే నెల ఐదో తేదీన 216 అడుగుల సమతామూర్తి శ్రీ రామనుజుల వారి విగ్రహావిష్కరణ విశేషాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి వెలంపల్లి. ఈ కార్యక్రమానికి ఏపీ నుంచి లైజనింగ్ ఆఫీసర్లుగా ఇద్దర్ని నియమించామని తెలిపారు…