కళియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తిరుపతి వెళ్లామంటే.. వెంటనే లడ్డూ తెచ్చారని అడుగుతుంటారు.. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఏపీ, తెలంగాణలోని అన్ని టీటీడీ ఆలయాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతోంది.. మరోవైపు.. శ్రీనివాసమంగాపురంలోనూ లడ్డూ విక్రయాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది టీటీడీ.. రేపటి నుంచి శ్రీనివాసమంగాపురంలో లడ్డూ విక్రయాలు ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలను…