శ్రీలంకను సంక్షోభం కుదిపేస్తోంది. రాజకీయ ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల మధ్య దేశ ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు శ్రీలంక మాజీ అధ్యక్షుడు, శ్రీలంక ఫ్రీడం పార్టీ (ఎస్‌ఎల్‌ఎఫ్‌పీ) అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్వహించిన మేడే ర్యాలీలో ఆయన కీలక ప్రకటన చేశారు. దేశంలో కొత్తగా ఎన్నికలు జరపాలన్నారు. ఎన్నికలే సమస్యలకు పరిష్కారం చూపుతాయన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. మనుగడకు పోరాటం చేస్తున్న ప్రజల్ని సంక్షోభం నుంచి బయటపడేయాలి. రాజకీయ నాయకులు ప్రజల…
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకను నిరసనలు చుట్టుముడుతున్నాయి. శ్రీలంక ప్రజలు తీవ్ర అసహనంతో వున్నారు. తీవ్ర ఘర్షణలకు దారితీశాయి పెట్రోలు, డీజల్ ధరల పెంపు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న రైల్వే ట్రాక్ పట్టాలు తొలగించారు ఆందోళనకారులు. రామ్ బుక్కన్న పోలీసు స్టేషన్ పై రాళ్ళ దాడికి పాల్పడ్డారు. దీంతో ఆందోళన కారులపై టియర్ గ్యాస్, రబ్బర్ బులెట్లు వర్షం కురిపించారు పోలీసులు. ఈ నిరసనల్లో ఇద్దరు మృతి చెందగా, అనేకమంది గాయాల…
ప్రస్తుతం శ్రీలంకలో రావణ కాష్టంలా రగిలిపోతోంది. ఆ దేశంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఈ క్రమంలో ప్రజలంతా కలిసి ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారు. రెండు రోజులుగా ప్రధాని రాజపక్సే ఇంటి వద్ద ప్రజలు తీవ్ర దాడులకు పాల్పుడుతున్నారు. దీంతో రాజపక్సే ప్రాణాలకు ప్రమాదం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆయన ప్రధాని పదవి రాజీనామా చేయాలని అల్టీమేటం కూడా వస్తోంది. దీంతో ప్రధాని రాజపక్సే విదేశాలకు పారిపోయే యోచనలో ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు శ్రీలంకలో…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభానికి తాజాగా రాజకీయ సంక్షోభం తోడైంది. ప్రజాగ్రహం నేపథ్యంలో ఆదివారం క్యాబినెట్ మంత్రులందరూ మూకుమ్మడి రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మంత్రుల్లో ప్రధాన మంత్రి కొడుకు నమల్ రాజపక్స కూడా ఉన్నారు. దేశంలో రాజకీయ సుస్థిరతకు తన రాజీనామా తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ప్రధాని మహింద్రా రాజపక్స మాత్రం రాజీనామా చేయలేదు. మరోవైపు శ్రీలంక సెంట్రల్ బ్యాంకు గవర్నర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ప్రధాని మహింద్రా రాజపక్సతో పాటు…
తీవ్ర సంక్షోభంలో వున్న శ్రీలంకలో జనం నానా అవస్థలు పడుతున్నారు. ఆర్థిక సంక్షోభం అత్యంత తీవ్రరూపు దాల్చింది. ధరలు ఆకాశాన్నంటుతుండడం, నిత్యావసరాల కొరత, ద్రవ్యోల్బణం వంటి అంశాలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. దీంతో దేశంలో అరాచక పరిస్థితులు నెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. శ్రీలంక ప్రభుత్వం 36 గంటల పాటు లాక్ డౌన్ ప్రకటించింది. దీనికి తోడు సోషల్ మీడియాపై ఆంక్షలు విధించింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల అస్థిరత రాజ్యమేలుతుండడంతో ఈ కర్ఫ్యూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం…
శ్రీలంకలో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగిపోవడంతో ప్రజలు ఆందోళనలు చేపడుతున్నారు. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే ఎమర్జెన్సీ ప్రకటించారు. శుక్రవారం రాత్రి నుంచే ఇది అమల్లోకి వచ్చింది. ప్రజలకు రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, అత్యవసర సరకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మరోవైపు శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. రోజుకు 13 గంటలపాటు…
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఇంధన కొరత, వంట గ్యాస్ కొరత కారణంగా ఆ దేశంలో వేలాది హోటళ్లు మూతపడ్డాయి. దీంతో ప్రజలు అంధకారంతో పాటు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది పక్క దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో తీవ్రమైన ఇంధన కొరత ఎదుర్కొంటున్న శ్రీలంకకు భారత్ ఆపన్న హస్తం అందించింది. అత్యవసరంగా 40వేల టన్నుల డీజిల్ పంపించాలని నిర్ణయించింది. ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ దీన్ని రవాణా…