బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. కడప ఎయిర్‌పోర్టు విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.. అయితే, ఆయన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి.. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న ఆయన.. కడప ప్రజలు మనుషులను చంపుతారని వారికి ఎయిర్ పోర్టు అవసరమా అని సోమువీర్రాజు వ్యాఖ్యలు చేయడం శోచనీయం అన్నారు.. ఆయన తన మాటలు వెంటనే వెనక్కు…
టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. కడపలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు సీనియారిటీతో దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగం లేదని ఆయన ఎద్దేవా చేశారు. సంక్రాంతి ముగిసి పదిరోజులు దాటినా జూదం, క్యాసినో పేరుతో చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. Read Also: విజయవాడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు మరోవైపు ఉద్యోగ సంఘాల…
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి స్పందించారు. కరోనాతో ఆర్థిక పరిస్థితులు దిగజారినా.. ఉద్యోగులు అడగ్గపోయినా సీఎం 27 శాతం ఐఆర్ ఇచ్చారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఐఆర్ ఇచ్చి ఉండకపోతే ప్రభుత్వం రూ.18వేల కోట్ల భారం పడి ఉండేది కాదన్నారు. ఐఆర్ ఇవ్వకుండా ఉంటే పెండింగ్‌లో ఉన్న చిన్న కాంట్రాక్టు బిల్లులన్నీ ప్రభుత్వం చెల్లించి ఉండేదన్నారు. ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా చూస్తున్నామని… ఉద్యోగులను నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు.…
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు సవాల్ విసిరారు ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి… కడపలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సోము వీర్రాజు ఆరోపణలపై స్పందించారు.. విభజన చట్టంలో స్పెషల్ స్టేటస్, పోర్టు వంటి హామీలు అమలు చేస్తే మద్దతు ఇస్తామన్న ఆయన.. కానీ, సోము వీర్రాజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. బీజేపీ విభజన హామీలు అమలు చేయలేదని అర్థమైందని ఎద్దేవా చేసిన శ్రీకాంత్ రెడ్డి.. తాను ఇసుక వ్యాపారం చేస్తున్నానని సోము వీర్రాజు అంటున్నారు……
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాల పనులను అధికారులు వేగవంతం చేయాలని ఆదేశించారు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… కడప జిల్లా రాయచోటి మండలం నారాయణరెడ్డిగారిపల్లెలో వైస్సార్ జగనన్న కాలనీని సందర్శించిన ఆయన.. ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించి.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాల పనులను వేగవంతం చేయాలన్నారు.. వాటితో పాటు త్వరితగతిన ఇసుక డంప్ ను ఏర్పాటు చేయాలన్న ఆయన.. యుద్ధప్రాతిపదికన…
కరోనా అంటించుకోవటం, అధికార పక్షంతో తిట్టించుకోవటం ఎందుకని అసెంబ్లీ బహిష్కరిస్తున్నాం అని టీడీపీ ప్రకటించింది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఒక్కో బహిరంగ సభకు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు పెట్టి జనాలను రప్పించే ప్రయత్నం చేశారు అని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బహిరంగ సభల ద్వారా కరోనా అంటించి పక్క రాష్ట్రం వెళ్లి పోయారు. పక్క రాష్ట్రంలో కూర్చుని విమర్శలు చేస్తున్నారు. ప్రజల గురించి మాట్లాడే చిత్తశుద్ధి…