Sridevi: అందాల అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం కలగలిపిన రూపం ఆమెది. పాత్ర ఏదైనా.. హీరో ఎవరైనా శ్రీదేవి హీరోయిన్ అంటే.. బొమ్మ బ్లాక్ బస్టర్ అని నమ్మేవారు. బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా ఆమె ఎదిగిన తీరు ఎంతో ఆదర్శప్రాయం.