ఇండియన్ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లలో అందాల తార జాన్వీ కపూర్ ఒకరు. కెరీర్ మొదట్లో వరుస ఫ్లాపులు పలకరించినా, ఇప్పుడు మాత్రం పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతోంది. అయితే, తాజాగా ఆమె తీసుకున్న ఒక నిర్ణయం బాలీవుడ్ వర్గాలను షాక్‌కి గురిచేస్తోంది. తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి, వెన్నంటి నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్‌కు జాన్వీ షాకిచ్చింది. ఆయనకు చెందిన ‘ధర్మ ప్రొడక్షన్స్’ టాలెంట్ మేనేజ్‌మెంట్ నుండి బయటకు వచ్చేసి, సొంతంగా తన కెరీర్…