సౌత్‌లో ‘మిల్కీ బ్యూటీ’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా టాలీవుడ్‌లో అడుగుపెట్టి దాదాపు 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2005లో ‘శ్రీ’ సినిమాతో హీరోయిన్‌గా ఎంటర్ అయిన ఆమె, తెలుగుతో పాటు తమిళం, హిందీ, వెబ్ సిరీస్‌లు ఇలా అన్ని భాషల్లోనూ తనకంటూ భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. లవ్ స్టోరీస్ నుంచి యాక్షన్ ఎంటర్టైనర్ లు, లేడీ ఓరియెంటెడ్ రోల్స్ నుంచి కమర్షియల్ మూవీస్ వరకు అనేక రకాల పాత్రలతో తన నటనలో కొత్తదనం చూపించింది తమన్నా.…