శ్రీకాకుళం జిల్లాలోని ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని ఆదుత్యి మూలవీరట్ పాదాలను తాకాయి లేలేత సూర్యకిరణాలు. అరుణ వర్ణంలోని భానుకిరణాల స్పర్శతో దేదీప్యమానంగా మూలవిరాట్ భక్తులకు దర్శనం ఇచ్చింది. ఉదయం 6:05 గంటలకు కొన్ని నిమిషాలపాటు ఆవిష్కృతమైన ఈ అద్భుత దృశ్యాన్నం భక్తులకు కనువిందు చెసింది.