శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని కియా పరిశ్రమలో ఏకంగా 900 కారు ఇంజిన్లు మాయం కావడం కలకలం రేపుతోంది.. కియా పరిశ్రమలో రోజుకి వందల కార్లు ఉత్పత్తి అవుతుంటాయి.. ఈ కియా కార్లు తయారు చేసే ప్రధాన పరిశ్రమకు విడిభాగాలు, పరికరాలు 25 కియా అనుబంధ పరిశ్రమల నుంచి వస్తాయి.. అయితే, దాదాపు 900 కియా కార్ల ఇంజిన్లు మాయమైనట్లు యాజమాన్యం గుర్తించింది..
రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మానవతప్పిదాలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రైలు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ పూర్తి స్థాయిలో ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. పెనుగొండ కియా ఫ్యాక్టరీ దగ్గర గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 7 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also Read:IPL 2025…
శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మడకశిర మండలంలో జరిగిన ప్రమాదంలో స్పాట్‌లోనే నలుగురు మృతిచెందినట్టుగా చెబుతున్నారు.. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 10 మందికి తీవ్రగాయాలపాలయ్యారు.. వీరిలో మరో నలుగురి పరిస్థితి విషయంగా ఉంది.
మరో తుపాను గండం పొంచివుంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం.. నేడు మరింత బలపడి, తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఇది తుఫాన్‌గా మారి.. ఎల్లుండి తీరం దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దసరా పండుగ పూట శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది.. చిలమత్తూరు మండలం నల్లబొమ్మని పల్లి సమీపంలో అత్తా కోడళ్లపై అత్యాచారానికి తెగబడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు.. నిర్మాణంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో వాచ్‌మన్‌గా ఉంటుంది ఓ కుటుంబం.. అయితే, రెండు బైక్‌లపై వచ్చిన దుండగులు.. కొడవలితో బెదిరించి ఘాతుకానికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు..
శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రం మార్పుపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. శ్రీ సత్య సాయి జిల్లా కేంద్రంగా పుట్టపర్తి కాకుండా హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు బాలయ్య.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఈ రోజు నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పర్యటించనున్నారు.. ఉదయం 9 గంటలకు రెండు జిల్లాల పర్యటనలకు బయల్దేరనున్నారు సీఎం చంద్రబాబు. నేడు శ్రీశైలం రానున్నారు.. సీఎం చంద్రబాబు. ఉదయం 10:30కి సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 10:50కి శ్రీమల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం జలాశయాన్ని సందర్శించి.. కృష్ణానదికి జలహారతి సమర్పిస్తారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసులు.. నడిరోడ్డుపైకి వచ్చి పబ్లిక్‌గా కొట్టుకోవడం చర్చగా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది..