హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్ చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి గడించిందని… తెలుగు సినిమా విశ్వవ్యాప్తమైందని కొనియాడారు. తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్‌పై అద్భుతాలు సృష్టిస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తెలుగు భాషా చరిత్ర ఎంతో సుసంపన్నమైందని కీర్తించారు. కాగా…
హైదరాబాద్ ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో రామానుజ సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. నాలుగో రోజు ఉత్సవాల్లో భాగంగా 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా తిరునామం పెట్టుకుని పట్టువస్త్రాలను నరేంద్ర మోదీ కట్టుకున్నారు. సంప్రదాయ వస్త్రాలలో యాగశాలలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సమతా మూర్తి విగ్రహం బరువు 1800 కిలోలు కాగా.. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే కూర్చున్న భంగిమలో ఉన్న రెండో…
రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమం వద్ద శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు జరిగిన రెండో రోజు ఉత్సవాలకు సీఎం కేసీఆర్ సతీసమేతంగా హాజరయ్యారు. తొలుత భారీస్థాయి ఏర్పాటు చేసిన శ్రీరామానుజ విగ్రహ ప్రాంగణాన్ని సీఎం కేసీఆర్ పరిశీలించి పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శ్రీరామానుజచార్యుల విగ్రహం సమానత్వానికి ప్రతీకలాంటిదని తెలిపారు. దేవుడి ముందు ప్రజలందరూ సమానమే అన్నారు. రామానుజచార్యులు అందరినీ సమానంగా ప్రేమిస్తారని… మనం కూడా రామానుజ…
హైదరాబాద్ శివారున వున్న ముచ్చింతల్‌కు సమీపంలోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. శ్రీ రామానుజాచార్యులు భూమిపై అవతరించి వెయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా…. 216 అడుగుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఆ విగ్రహ ఆవిష్కరణ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఇవాళ్టి నుంచి 14 వరకు జరిగే… వివిధ కార్యక్రమాలకు… శ్రీరామ నగరాన్ని ముస్తాబు చేశారు. ఇప్పటికే సమతామూర్తి విగ్రహం ఎప్పుడు ఆవిష్కారం అవుతుందా అని భక్తులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు.…
వెయ్యేళ్ల క్రితం ధరాతలంపై నడయాడిన సమతామూర్తి జగద్గురు శ్రీరామానుజాచార్యులు మళ్లీ మనకు దర్శనమివ్వనున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో 45 ఎకరాల విస్తీర్ణంలో శిల్పకళా శోభితమైన కళ్లు చెదిరే నిర్మాణాలు, పచ్చల కాంతులతో పుడమి నవ్వుతున్నట్లు ఎటు చూసినా మొక్కలతో హాయిగొలిపే పచ్చదనం.. వందకు పైగా ఆలయాల గోపురాలపై దేవతా మూర్తులతో ఆధ్యాత్మిక సుగంధాల మధ్య 216 అడుగుల భారీ లోహ విగ్రహంగా ఆయన వెలిశారు. ఇక, శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల కోసం ముచ్చింతల్…