రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లక్షలాదిమంది భక్తుల రాకతో పులకించింది. అక్కడ ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహం కనులవిందుగా కనిపించింది. శ్రీరామనుజుల కీర్తి దశదిశలా మరోమారు వ్యాపించింది. సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీరామనగరంలో 12 రోజుల పాటు జరిగిన మహా క్రతువులో వేలాది మంది రుత్వికులు.. లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. అంకురార్పణ నుంచి మహా పూర్ణాహుతి వరకు నిత్యం ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించారు. భారత దేశానికి చెందిన అతిరథ మహారథులు, రాజకీయ ప్రముఖులు సమతామూర్తిని…