(జూన్ 22న ‘శ్రీమంజునాథ’ 20 ఏళ్ళు పూర్తి) ఎందరో భక్తశిఖామణుల జీవితగాథలు తెరపై ఆవిష్కృతమయ్యాయి. ఆ కోవకు చెందినదే చిరంజీవి, అర్జున్ నటించిన భక్తి రసచిత్రం ‘శ్రీమంజునాథ’. కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రకు చెందిన కోటిలింగేశ్వర స్వామి దేవాలయం భక్తకోటిని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. అక్కడి ధర్మస్థల క్షేత్రం కూడా సుప్రసిద్ధమైనది. ఇక్కడి దేవుడు శ్రీమంజునాథునిగా పూజలందుకుంటూ ఉంటాడు. ఆయన మహిమతో జన్మించిన మంజునాథ అనే భక్తుని కథతో తెరకెక్కిన చిత్రమే ‘శ్రీమంజునాథ’. శివునిగా చిరంజీవి, భక్తునిగా…