(సెప్టెంబర్ 13న సంగీత దర్శకుడు శ్రీ జయంతి) చిత్రసీమలో ఎందరో కళాకారుల వారసులు తమదైన బాణీ పలికించారు. సంగీత దర్శకుల వారసులు మన తెలుగు సినిమా రంగంలో అరుదుగానే కనిపిస్తారు. వారిలో చక్రవర్తి తనయుడు శ్రీనివాస చక్రవర్తి ఒకరు. తొలుత తండ్రి స్వరకల్పనలో గాయకునిగా పరిచయమైన శ్రీనివాస్ ఆ తరువాత శ్రీ పేరుతో సంగీత దర్శకునిగానూ అలరించారు. ఒకటిన్నర దశాబ్దం పాటు తెలుగు చిత్రసీమ సంగీత సామ్రాజ్యాన్ని చక్రవర్తి మకుటం లేకుండానే ఏలారు. ఏడాదికి వచ్చే చిత్రాలలో…