ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రేపు(శుక్రవారం) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్న నేపథ్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే టీటీడీ (TTD) అన్నీ ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ సందర్భంగా రేపు తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలుపుతారు. అనంతరం ఉదయం 8 నుండి 11.30 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగనుంది.